Pages

Monday, August 5, 2013

రెండో గ‌బ్బర్‌సింగ్‌కి అంతా సిద్ధం


August 5th, 2013, 11:34 AM IST
రెండో గ‌బ్బర్‌సింగ్‌కి అంతా సిద్ధం
గ‌బ్బర్‌సింగ్ సీక్వెల్ ఉంటుందా లేదా అన్న స‌స్పెన్స్‌కి తెర‌ప‌డింది. ఎట్టకేల‌కు ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఈ నెల 19న లాంభ‌నంగా  కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ప‌వ‌న్ సొంతంగా రాసిన క‌థ‌తో ద‌ర్శకుడు సంప‌త్ నంది ఈ స్ర్కిప్ట్ త‌యారు చేశాడు. అయితే మొద‌ట ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ స్ర్కిప్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో మ‌ళ్లీ సంప‌త్‌నంది ఓ ర‌చ‌యిత‌ల బృందంతో కూర్చుని కొత్తగా క‌థ‌ను రాసుకొన్నాడు. చివ‌రికి అది ప‌వ‌న్ కి సంతృప్తినిచ్చింద‌ట‌. దీంతో వెంట‌నే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ‌దామ‌ని ప‌వ‌న్ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. 

అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత ప‌వ‌న్ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకొందామ‌నుకొన్నాడ‌ట‌. అయితే వ‌రుస‌గా ఒప్పుకొన్న సినిమాల వ‌ల్ల విశ్రాంతి తీసుకోకుండా ప్రాజెక్టుల‌న్నిటినీ చ‌క‌చ‌కా పూర్తి చేయాల‌ని నిర్ణయించుకొన్నాడ‌ట‌. ఈ సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్నది ఇంకా తేల‌లేదు. కాజ‌ల్‌నే తీసుకొద్దామ‌ని చిత్రబృందం భావిస్తోంద‌ట‌. అమ్మడి చేతిలో సినిమాలేవీ లేవు కాబ‌ట్టి కాజ‌ల్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈసినిమాకి గ‌బ్బర్‌సింగ్ 2 అనే పేరు ప్రచారంలో ఉంది. ఆ పేరుపై  షోలే నిర్మాత‌లు అభ్యంత‌రం చెబుతుండ‌టంతో బెంగాల్ టైగ‌ర్ అనే పేరు పెట్టాల‌ని చిత్రబృందం నిర్ణయించుకొంద‌ట‌. ఈ చిత్రాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆయ‌న స్నేహితుడు శ‌ర‌త్‌మ‌రార్ క‌లిసి నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment